laali laali laalamma లాలి లాలి లాలమ్మ లాలి లాలనుచు బాడరే బాల యేసునకు లాలి
లాలి లాలి లాలమ్మ లాలి - లాలనుచు బాడరే బాల యేసునకు || లాలి ||1.పరలోకపు దేవ తనయుడోయమ్మా - పుడమిపై బాలుడుగ పుట్టెనోయమ్మా || లాలి ||2.ఇహ పరాదుల కర్త యితడేనొ యమ్మా - మహిబాలనము జేయు మహితుడోయమ్మా || లాలి ||3.ఆదియంతము లేని యనఘుడో యమ్మా - ఆదాము దోషమున కడ్డుపడె నమ్మా || లాలి ||4.యూదులకు రాజుగా బుట్టెనోయమ్మా - యూదు లాతని తోడ వాదించిరమ్మా || లాలి || 5.నర గొర్రెల మంద కాపరో యమ్మా - గొర్రెలకు నందంబు క్రీస్తు తానమ్మా || లాలి ||